తెలుగు సినీ పరిశ్రమకు ఈరోజు బాధాకరమైన రోజు: మహేశ్ బాబు

  • కృష్ణంరాజు మృతిపై మహేశ్ ఆవేదన
  • ఆయన జీవితం ఎప్పటికీ గుర్తుండి పోతుందని వ్యాఖ్య
  • కృష్ణంరాజు మృతికి సంతాపం ప్రకటించిన మహేశ్
రెబెల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. తనకే కాక... యావత్ తెలుగు సినీ పరిశ్రమకు ఈరోజు చాలా బాధాకరమైన రోజని చెప్పారు. కృష్ణంరాజు గారి జీవితం, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు, ఆయన పని చేసిన విధానం ఎప్పటికీ గుర్తుండి పోతాయని అన్నారు. 

తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.

mahesh babu
Tollywood
krishnam raju

More Telugu News